WGL: వానాకాలం ప్రారంభ వర్షాలు కురిసిన వెంటనే రైతులు విత్తనాలు నాటకుండా జాగ్రత్త వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. తగినంత తేమ లేకుండా పొడి దుక్కుల్లో విత్తడం వల్ల మొలకలు సరిగా రాక పెట్టుబడి, శ్రమ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. భూమిలో సరిపడా తేమ ఏర్పడిన తర్వాతే విత్తనాలు వేయాలని అధికారులు తెలిపారు.