కర్ణాటకలో ‘పెద్ది’ సినిమా ప్రభంజనం సృష్టించింది. అక్కడ ప్రీమియర్ షోల ద్వారా రూ.3.2 కోట్ల భారీ వసూళ్లు సాధించి.. అత్యధిక ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. గతంలో ‘OG’ (రూ.2.72 కోట్లు), ‘రాజాసాబ్’ (రూ.2.61 కోట్లు), ‘పుష్ప 2’ (రూ.2.55 కోట్లు) సాధించిన వసూళ్లను అధిగమించి ‘పెద్ది’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.