NLG: గ్రామాల్లోని నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించే ప్రభుత్వ పాఠశాలలను ప్రజలంతా బలోపేతం చేయాలని డీఈవో సుశీంధర్ రావు కోరారు. ఇవాళ అనుముల మండలం చింతగూడెంలో నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలన్నారు.