వరంగల్ పట్టణ కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మాజీ MLC కొండా మురళీ వివిధ డివిజన్ల ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ఆసుపత్రి సేవల సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తానని ఆయన తెలిపారు.