శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి అన్నారు.