AP: రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై నేటికి రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ‘అరాచక, విధ్వంసక పాలనకు ప్రజలు శాశ్వతంగా చరమగీతం పాడారు. వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి పొందారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టింది. అమరావతి పునర్నిర్మాణం కూటమి ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం’ అని పేర్కొన్నారు.