AP: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కూటమి పాలన సాగుతోందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. చంద్రబాబు సమర్థ, సుస్థిర పాలనతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని వ్యాఖ్యానించారు. మోదీ, చంద్రబాబు, పవన్ జోడితో సమగ్రాభివృద్ధి దిశగా ఏపీ పయనం సాగుతోందని వెల్లడించారు.