AP: రష్యాలో మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన ప్రముఖ ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరిస్తూ.. విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ అసెంబ్లీ యూనిట్, నెల్లూరులో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే శ్రీసిటీలో రోబోటిక్స్ సేవల విస్తరణకు చొరవ చూపాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.