ATP: తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి రెండు సంవత్సరాలు పూర్తి అయిందని ఇవాళ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నేను ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు అభిమానులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని ఆయన అన్నారు.