BDK: కొత్తగూడెం 20వ డివిజన్ పరిధిలోని నిమ్మలగూడెంలో గురువారం జరిగిన ఇందిరమ్మ గృహప్రవేశానికి మేయర్ మూడు గణేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ పథకంతోనే పేదవాడి సొంతింటి కల సాకారమైందన్నారు. త్వరలోనే ప్రభుత్వం రెండో విడత ఇళ్లను కూడా మంజూరు చేయనుందని వెల్లడించారు.