SS: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు శాఖలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించినట్లు మంత్రి సవిత తెలిపారు.