W.G: పాలకొల్లు, నరసాపురం, పోడూరు పరిసర ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురం DSP సుధాకర్ రావు మాట్లాడుతూ.. నరసాపురానికి చెందిన కొత్తపల్లి నరేశ్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.