మంచిర్యాలలో బడి బాట కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రం పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీత ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ పద్మ ఇంటింటికీ వెళ్లి ఐదేళ్లు పూర్తయిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.