ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ పర్యావరణ అనుకూల ఇంధనంతో నడిచే తన సరికొత్త ‘వ్యాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్’ కారును మార్కెట్లోకి పరిచయం చేసింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి సంయుక్తంగా ఈ సరికొత్త మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు కాలుష్య నియంత్రణకు ఈ కారు ఎంతగానో దోహదపడనుంది.