AP: DSC పేరుతో నిరుద్యోగులను మోసం చేసి.. కూటమి ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. అమ్మఒడిని ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. పలాస MLA శిరీష సూది కొండను బోడికొండగా మార్చారని, మైనింగ్ మాఫియాగా మారి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మద్యం బాటిల్‌పై అక్రమ వసూళ్లు చేస్తూ బెల్టు షాపులతో భారీ దోపిడీకి తెగబడుతున్నారన్నారు.