SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలో ధాన్యం అమ్మకానికి తెచ్చిన రైతులతో అదనపు కలెక్టర్ నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియ, తూకం, తేమ శాతం, చెల్లింపుల వివరాలను అధికారులను అడిగి ఆరా తీశారు.