JN: జనగామ పట్టణంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ దుకాణాలను నేడు పరిశీలించారు. జిల్లా కార్యదర్శి భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ.. పెరిగిన ఎరువుల ధరలను ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు లైసెన్స్ గల డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, డీలర్లు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని కోరారు.