BPT: చీరాల వైసీపీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో చీరాల మండల నాయకులు కూరగాయల మార్కెట్ సమీపంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఇప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.