AP: నకిలీ జీఓల సృష్టి, వేల కోట్ల భూకుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను(GOs) ఉపయోగించి HYD శివార్లలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై నార్సింగి పోలీసులు బ్రహ్మనాయుడితో పాటు మరికొందరిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేశారు.