విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని గురుద్వార్ జంక్షన్లో గురువారం వైసీపీ నేతలు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ.. వాటికి సంబంధించిన బాండ్ల ప్రతులను అగ్నికి ఆహుతి చేశారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలకు మోసం జరిగిందన్నారు.