సత్యసాయి: కొత్తచెరువు మండలం తిరుమలదేవరపల్లిలో గురువారం రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అర్హులైన రైతన్నలకు రాజముద్ర కలిగిన కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.