గద్వాల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంపై అఖిలపక్ష నాయకులు ఒక ప్రకటనలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను ఇలా అణచివేస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎలా సాగుతుందని వారు ప్రశ్నించారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలోని పెండింగ్ సమస్యలను, ప్రజా అవసరాలను ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు.