JGL: వర్షాకాలం ప్రారంభానికి ముందుగా రైతులు నాగలిని భూమిలో ఉంచే సంప్రదాయాన్ని బొంకూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నాగలి తాకితే నేల పులకరిస్తుందని, వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రైతుల విశ్వాసం. కొన్ని రోజుల తర్వాత నాగలిని తీసి పొలాలు దున్నే పనులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శిరీష పాల్గొన్నారు.