కడప నగరంలోని హరిత హోటల్లో DSC-2025పై నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ DSCపై అసత్య ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, రాజకీయ స్వార్థంతో DSCపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.