నీట్ రద్దుతో తీవ్ర మనస్తాపానికి గురైన MPకు చెందిన విద్యార్థిని ఆకాంక్ష చతుర్వేది ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రైతు అయి ఉండి, రూ.3 లక్షల అప్పు చేసి, వంటవాడిగా మారి నాగ్‌పూర్‌లో చదివించినా పేపర్ లీక్ వల్ల ఆమె ఆశలు ఆవిరయ్యాయి. ‘సారీ మమ్మీ, పాపా.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’ అని ఆమె రాసిన సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ప్రస్తుతం ఈ కేసును CBI విచారిస్తోంది.