AP: రాజధాని పరిధిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగుపై వంతెన పనులను పరిశీలించిన ఆయన, ప్రవాహానికి ఆటంకం లేకుండా మట్టిని తొలగించి, వాగును వెడల్పు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నీరుకొండ, శాఖమూరు, పెనుమాక రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. మొత్తం 674 ఎకరాల్లో 0.51 TMC సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ మూడు రిజర్వాయర్ల పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయినట్లు మంత్రి తెలిపారు.