HYD: మూడు కార్పొరేషన్ల పరిధిలో 1045 కి.మీ రోడ్ల ప్రైవేటు నిర్వహణ కోసం రూ.3,145 కోట్లతో సీఆర్ఎంపీ-2 ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టెండర్లను జీహెచ్ఎంసీ నిర్వహించనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రహదారి మౌలిక వసతులు మెరుగుపడి నిర్వహణ పనులు వేగవంతమయ్యి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.