SKLM: నాగవలి నదిలో జల కాలుష్యాన్ని నివారించాలంటూ కళ్ళకు గంతలు పట్టుకుని సీపీఎం పార్టీ నాయకులు గురువారం నిరసన తెలియజేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 3 సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికై అండర్ డ్రైనేజీ సిస్టం నిర్మాణానికి నిధులు ఎందుకు కేటాయించడంలేదని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు మండిపడ్డారు. జలకాలుష్యం ఏర్పడడం వలన రోగాలకు గురవుతారని తెలిపారు.