SRPT: మఠంపల్లి మండలం లాలి తండా గ్రామంలో ఇటీవల వీచిన ఈదురుగాలులకు తాళ్లూరి వీరబ్రహ్మచారి ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, యువకులు కలిసి స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. గ్రామస్థుల సహకారంతో రూ.10 వేల నగదును సేకరించి ఇవాళ నిత్యావసర సరుకులతో పాటు అందజేశారు.