BDK: చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6వ తేదీ నుంచి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా అమలు చేయబడుతోందని తెలిపారు.