CTR: ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి ఆరోపించారు. చిత్తూరు రూరల్, గుడిపాల మండలాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.