JN: నర్మెట్ట మండలంలోని వెల్దండలో ఏర్పాటు చేసిన IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, లోడింగ్ ప్రక్రియ, ట్రక్ షీట్ నిర్వహణ, రిజిస్టర్ల నమోదును పర్యవేక్షించారు. కొనుగోలు కేంద్రంలో లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ట్రక్ షీట్,సంబంధిత రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు.