BHPL: కుటుంబ విభేదాల నేపథ్యంలో ఓ వివాహిత మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. HNK(D) కమలాపూర్ (M) కన్నూరు గ్రామానికి చెందిన లక్ష్మి (25) రేగొండ(M) రేపాక గ్రామానికి చెందిన హరితో వివాహమైంది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య వివాదాలు నెలకొన్నాయి. దీంతో మనస్థాపానికి గురై లక్ష్మి నిన్న పురుగుల మందు తాగి మరణించింది. పోలీసులు కేసు నమోదు చేశారు.