MLG: ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామప్ప ఆలయాన్ని మాజీ జడ్పీ ఛైర్మన్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి-జగదీష్ గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు రామప్ప ఆలయం ప్రతీకగా నిలుస్తోందని నాగజ్యోతి తెలిపారు.