SRPT: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ఇవాళ తెల్లవారుజామున ఓ ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. కోదాడ నుంచి అనంతగిరి వైపు వెళ్తుండగా.. రోడ్డుపైకి అకస్మాత్తుగా కుక్క రావడంతో డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోయాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పెరుగు బకెట్లు కిందపడి చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.