వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 102 మంది వాహనదారులు మద్యం తాగి పట్టుబడ్డారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 44, సెంట్రల్ జోన్ 22, ఈస్ట్ జోన్ 13, వెస్ట్ జోన్లో 23 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.