రామ్‌చరణ్, జాన్వీకపూర్ జంటగా నటించిన ‘పెద్ది’లోని ‘చికిరి చికిరి’ సాంగ్ 10 కోట్లకు పైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. AR రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటలోని ‘సరుకూ సామాన్లు’ అనే పదంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మేకర్స్ థియేటర్లలో ఆ పదాన్ని ‘సొగసు సింగారం’గా మార్చినట్లు నెటిజన్లు SMలో పోస్ట్‌లు పెడుతున్నారు.