HYD: కూకట్పల్లి PS పరిధిలో ఘోరం జరిగింది. ఖైతలాపూర్లో నివాసముంటున్న దంపతులు రహీం, సుమేరా మధ్య తలెత్తిన కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. కోపంతో భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన రహీం, హత్య అనంతరం నేరుగా PSకు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.