VSP: నార్వే పర్యటనలో ఉన్న విశాఖ ఎంపీ శ్రీభరత్ అక్కడి పార్లమెంట్‌ను సందర్శించారు. నార్వే మాజీ ప్రధాని ఎర్నా సోల్బర్గ్, భారత సంతతి ఎంపీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి కొరకై వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై విస్తృతంగా చర్చించారు. భారత్- నార్వే సంబంధాల బలోపేతానికి ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ టూర్ ఎంతో దోహద పడుతుందన్నారు.