NZB: ముప్కాల్ మండలం కొత్తపల్లి కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40 సీట్లు ఖాళీగా ఉన్నట్లు స్పెషల్ ఆఫీసర్ వినోద తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు సంబంధిత ధ్రువపత్రాలు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థినులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.