AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశం నుంచి పవన్ అర్థాంతరంగా వెళ్లిపోయారు. భేటీ జరుగుతున్న సమయంలో ఆయన వెన్ను నొప్పి రావడంతో వెళ్లిపోయినట్లు సమాచారం. సమావేశం నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి రెస్ట్ తీసుకున్నారట. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.