ASF: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఎస్పీ నితికా పంత్ కాలినడకన పెట్రోలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ ప్రజల రక్షణను సమీక్షించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని ఎస్పీ వాహనదారులకు సూచించారు.