NLG: అంబేద్కర్ యూనివర్సిటీ డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లును TG లెక్చరర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు పెరిక మధు కలిశారు. ఈ సందర్భంగా రీజినల్ సెంటర్లకు, NG కళాశాలకు UG, PG కోర్సుల తెలుగు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను విద్యార్థులకు, అధ్యాపకులకు అందుబాటులో ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై డైరెక్టర్ స్పందించి ఏడు రోజుల్లోగా వారికి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.