MDCL: ప్రగతి నగర్ కమాన్ వద్ద చేపడుతున్న వరద నీటి పైప్లైన్ పనులను కుత్బుల్లాపూర్ జోన్ కమిషనర్ పింకేష్ కుమార్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలనీలకు వరద ముంపు సమస్య తలెత్తకుండా చూడాలని, అలాగే సాధారణ డ్రైనేజీ పైప్లైన్లలోకి ఈ వరద నీటిని కలపకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాలనీ వాసులు కోరారు.