ELR: వేలేరుపాడులో డీఎంహెచ్ఓ శోభారాణి ఆధ్వర్యంలో బుధవారం క్లినిక్‌లు, రక్త పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. గతంలో గర్భిణి మృతి కేసులో సీజ్ చేసిన శ్రీనివాసరావుకు చెందిన ఆర్ఎంపీ క్లినిక్‌ను మళ్ళీ తెరిచి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. క్లినిక్‌లో సర్జరీ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకొని క్లినిక్, పక్కనే ఉన్న మందుల దుకాణాన్ని సీజ్ చేశామన్నారు.