WGL: గీసుకొండ మండలం ఊకల్ హవేలీకి చెందిన దేవేందర్, సునీత దంపతులు కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ ఇందిరమ్మ పథకం ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. మే 30న గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటుడగా సునీతను పాము కాటేసింది. తీవ్రంగా అస్వస్థతకు గురైన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.