TG: రాష్ట్ర ఈగల్ పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించారు. థాయిలాండ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా రవాణా అవుతున్న రూ.12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మెగా ఆపరేషన్లో కీలక సూత్రధారితో పాటు మొత్తం 10 మంది డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.