GNTR: తెనాలి పట్టణంలోని ప్రధాన డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు తొలగింపుకు అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం నుంచి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు 26, 27 వార్డులలో పర్యటించి పూడిక తొలగింపు పనులను పర్యవేక్షించారు. మంత్రి నాదేండ్ల మనోహర్ ఆదేశాల మేరకు వర్షాకాలంలో నీటి పారుదలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజీల ప్రక్షాళన చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.