హన్మకొండ నగరంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అర్చక ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు, వేములవాడ ఆలయ ప్రధాన అర్చకులు నిన్న కలిశారు. అర్చకుల ప్రమోషన్లు, కొత్త నియామకాలు చేపట్టాలని వారు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ అభివృద్ధికి రూ. 170 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.