MHBD: ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. కోమటిపల్లి గ్రామస్థులు ఎడ్లబండ్లు, వాహనాల్లో భారీగా తరలివచ్చి బోనాలు సమర్పించారు. మహిళలు బోనమెత్తి డప్పు చప్పుళ్లు, పూనకాల నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ముత్యాలమ్మ, మారెమ్మ, పెద్దమ్మ, లోతుకుంట మైసమ్మలకు మొక్కులు చెల్లించారు.